కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తులు అరెస్టు..!
కల్తీ పాల ముఠా అరెస్ట్..
యాదాద్రి భువనగిరి జిల్లా: ఎండాకాలం సీజన్ కావడంతో పాలు తక్కువగా ఉండడం వల్ల పాల అవసరాలు ఎక్కువగా ఉండడంతో అధిక డబ్బులు సంపాదించాలని అత్యాశతో కల్తీ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు భువనగిరి రూరల్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి వారిని అరెస్టు చేసిన ఘటన భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వడపర్తి గ్రామానికి చెందిన మేడ బోయిన మహేష్, మేడబోయిన బాలయ్య, మేడబోయిన శ్రీశైలం ముగ్గురు గ్రామంలోని రైతుల దగ్గర పాలు సేకరించి ఇతర ప్రాంతాల్లోనీ, హోటల్లోకి పాలను విక్రయిస్తుంటారు. ఈ మధ్య కాలంలో హోటల్ వారు పాలు ఎక్కువగా సప్లై చేయాలని, అనడంతో పాల కల్తీకి పాల్పడుతున్నారని, విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి వారి వద్ద ఉన్న కల్తీ పాలు300 వందల లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ 500 మిల్లీ లీటర్స్, ఆక్సి టోలిన్ బాటిల్ 200 మిల్లీ లీటర్స్, డాల్ ఫర్ మిల్క్ పౌడర్ ఒక కేజీ, పది ప్లాస్టిక్ క్యాన్లు, ఒకటి స్టీల్ క్యాన్, మరొకటి స్టీల్ ఉన్న పాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటితో పాటు నాలుగు సర్ఫ్ ప్యాకెట్లు, నాలుగు గోల్డ్ డ్రాప్ నూనె ప్యాకెట్లు, డాల్ పర్ ప్రేషి మిల్క్ పౌడర్, రెండు కేజీల ను స్వాధీనం చేసుకొని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు రూలర్ ఎస్సై రాఘవేందర్ తెలిపారు…