మంచిర్యాల జిల్లా: మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని మంచిర్యాల పట్టణ ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్ వాహనదారులను హెచ్చరించారు. సోమవారం మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని చిన్న వయసులో మద్యానికి బానిసలు కావద్దని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపటం వల్ల జరిగే అనర్ధాలను వివరించారు. ఉద్యోగం, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలన్నారు. ఇక మీదట ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని అన్నారు..