మంచిర్యాల జిల్లా: చెన్నూరు మండలంలోని పొక్కూరు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. సమాజంలో అస్పృశ్యతను నిర్మూలించడం నుండి మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహా నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.