Telugu Updates

ఏపీ క్యాబినెట్ లో కొనసాగనున్న పాత మంత్రులు వీరే?

ఆంద్రప్రదేశ్: రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ తన మంత్రివర్గం కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. గవర్నర్ కు కొత్త మంత్రుల జాబితాను ఆదివారం పంపించనున్నారు. క్యాబినెట్ లో బెర్త్ దక్కిన వారికి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మధ్యాహ్నానికి ఫోన్ల ద్వారా సమాచారం అందించనున్నారు. 11న సోమవారం ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ క్రమంలో మంత్రివర్గ జాబితా దాదాపుగా సిద్ధమైందని తెలుస్తోంది. 10 మంది మంత్రులను కొనసాగించనున్నట్లు సమాచారం. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాథ్, కొడాలి నాని, గుమ్మనూరు జయరాం, సిదిరి అప్పలరాజు. చెల్లుబోయిన వేణుగోపాల్, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, పేర్ని నాని కొత్త క్యాబినెట్లో కొనసాగనున్నట్లు ప్రచారం..