Telugu Updates

వాహనాల దహనం కేసులో నలుగురి అరెస్టు..!

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో పాత్రికేయుడు బద్రి వెంకటేష్ కు సంబంధించిన వాహనాల దహనం కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. గత నెల 26వ తేదీన అర్ధరాత్రి నలుగురు యువకులు పెట్రోల్ పోసి ద్విచక్రవాహనం, కారును తగులపెట్టారని చెప్పారు. ఈ కేసులో రడపాక రాజ్ కుమార్ (రవీంద్రనగర్), గోసిక కార్తీక్ (టేకుల బస్తీ), దాసరి అజయ్ (మధునన్ననగర్), శ్రీరాముల మహేష్(కన్నాలబస్తీ)లను అరెస్టు చేశామని పేర్కొన్నారు. కుటుంబ పంచాయతీల్లో వెంకటేష్ జోక్యం చేసుకుంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని నలుగురు కక్ష పెంచుకున్నట్లు తెలిపారు. వెంకటేష్ కు ఎలాగైనా నష్టం కలిగించాలనే ఉద్దేశంతో వాహనాలను దహనం చేశారని చెప్పారు. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వివరించారు..