Telugu Updates

అంతిమయాత్రలో అండగా మున్సిపల్ వైకుంఠ రథం

మంచిర్యాల జిల్లా: ఓ వ్యక్తి మరణం వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపుతుంది. పేద కుటుంబాల్లో అయినవారిని పోగొట్టుకున్న బాధలో ఉన్నవారికి అంత్యక్రియల ఖర్చులు మరింత భారంగా మారతాయి. అలాంటి వారికి మంచిర్యాల మున్సిపాలిటీ అండగా నిలుస్తోంది. మున్సిపాలిటీ పరిధిలో పేదలు మృతి చెందితే, ఆయా మృతదేహాలను శ్మశానవాటికలకు ఉచితంగా తరలించేందుకు పట్టణ ప్రగతి నిధులు రూ. 18 లక్షలతో వైకుంఠరథం ఏర్పాటు చేశారు. దీనిని రెండు, మూడు రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.