మంచిర్యాల జిల్లా: మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణలో బీరు బాటిళ్లతో దాడి చేయడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దెరాగడిలో ఆదివారం సాయంత్రం జరిగింది. మందమర్రి సీఐ ప్రమోద్ రావు తెలిపిన వివరాల ప్రకారం. కుర్మపల్లి గ్రామానికి చెందిన నాస వినయ్, బండ వంశీ ఆదివారం గద్దెరాగిడిలోని ఓ వైన్స్ షాపుకు వెళ్లారు. మద్యం సేవిస్తున్న క్రమంలో అక్కడే మద్యం సేవిస్తున్న గోదావరిఖనికి చెందిన సాయి అనే మరో యువకుడికి మధ్య చిన్న గొడవ మొదలైంది. మాటమాట పెరుగడంతో సాయి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి బీరు బాటిళ్లతో వినయ్, వంశీపై దాడి చేశారు. ఘటనలో వినయ్, వంశీలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. పట్టణ ఎస్సై సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు..