Telugu Updates

18న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞత సభ..!

మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం: చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఆమోదం తెలిపి, రూ. 1, 658 కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు ఈ నెల 18న చెన్నూరులో కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ తెలిపారు. తాను కోరిన వెంటనే చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఆమోదం తెలపడంతో పాటు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. లిఫ్ట్ ద్వారా నియోజకవర్గంలోని 5 మండలాల్లోని 103 గ్రామాల్లో 90 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడికి వచ్చి భూమి పూజ చేస్తారని, అనంతరం పనులను వేగవంతం చేస్తామని సుమన్ వెల్లడించారు. కృతజ్ఞత సభలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు..