మంచిర్యాల జిల్లా: ప్రేమిస్తున్నానని చెప్పి శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఓ యువతి ఏకంగా పెళ్లి పీటల మీద జరుగుతున్న వివాహాన్ని అడ్డుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోనీ గద్దె రాగడి ప్రాంతంలోని భీమా గార్డెన్స్ లో చోటుచేసుకుంది. ఈ మేరకు బాధితురాలు గుళ్ళ రామినా తెలిపిన వివరాల ప్రకారం వివాహం చేసుకుంటున్న రాజేష్(రాజు) తో నాలుగు సంవత్సరల పాటు పరిచయం ఏర్పడిందని హన్మకొండలో ఫార్మసీ చదువుతున్న సమయంలో ప్రేమిస్తున్నాను అని చెప్పి హన్మకొండకు వచ్చి యాదగిరి గుట్టకు తీసుకువెళ్లి శారీరకంగా వాడుకున్నాడని, గడిచిన సంవత్సరం క్రితం అపర్షన్ చేపించాడని తెలిపింది. రాజేష్ వివాహం చేసుకుంటున్న విషయం వేరే వారి ద్వారా తెలిసిందని, వివాహం జరుగుతున్న విషయాన్ని చెప్పకుండా నిన్నటి వరకు చాటింగ్ చేశాడని, వాళ్ళ బంధువులు వాట్సప్ లో పెట్టుకున్న స్టేటస్ చూసి పెళ్ళీ జరుగుతున్న ఫంక్షన్ హాల్ కు వచ్చి వివాహాన్ని ఆపేందుకు ప్రయత్నం చేశానని చెప్పారు. ఈ సమయంలో యువతి వద్ద ఫోన్ లో ఉన్న ఆధారాలను పెళ్లి పిల్ల తరుఫున బంధువులకు చూపిస్తున్న సమయంలో ఫోన్ తీసుకొని రాజేష్ వాళ్ళ అమ్మ వచ్చి కొట్టిందని, వారితో పాటు ఇంకో ఇరవై మంది వచ్చి దాడి చేశారన్నారు.
ఫంక్షన్ హాల్ నుంచి పోలీస్ స్టేషన్ కు వెళుతున్న క్రమంలో రెండు మూడు సార్లు అడ్డుకునేందుకు ప్రయత్నించారనీ తెలిపింది. రామినా కు 2012 లో దగ్గరి బంధువులు ఆయన మెన బావతో వివాహం జరిగిందని, అతనికి ఉన్న ఇల్లీగల్ ఎఫైర్ తో విడాకులు తీసుకున్నాననీ మీడియాకు తెలియజేశారు. రామకృష్ణాపూర్ పట్టణ పోలీస్ స్టేషన్ లొ బొద్దుల రాజేష్ తో వివాహం జరిపించాలని, లేకపోతే చనిపోతానని ఎస్సై అశోక్ యువతి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు