మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని జాఫర్ నగర్ లో 21 నెలల షాజస్ బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. తన కుమారుడు కనిపించడం లేదని ఈ నెల 2న బాలుడి తల్లి బావురి చాందిని అనే మహిళ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్న బాబు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు టీములు గాలింపు చర్యలు చేపట్టి స్థానిక ఓవర్ బ్రిడ్జి దగ్గర వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక ఆటోలో అనుమానాస్పదంగా చిన్న పాపతో ఉన్న కొంత మంది వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుంటే వారిని పోలీసులు పట్టుకొని విచారింగా వారి దగ్గర ఉన్న బాబు జాఫర్ నగర్ లో కిడ్నాప్ చేయబడిన బాబు అని ఒప్పుకున్నారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. పట్టుబడిన వారిలో కిచ్చ సంగు, వంకడోత్ నరేష్, వొర్సు కొమురయ్య, వొర్సు విజయ, వొర్సు సంపత్ ఉన్నారు.
బాబును కాపాడడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఇంచార్జి డిసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ అభినందించారు.