Telugu Updates

తమ్ముడు పార్టీ వీడతానంటే.. స్టార్ క్యాంపెయినర్ స్పందించరా?: వీహెచ్

హైదరాబాద్: కాంగ్రెస్ అంటేనే నల్గొండ అని చెబుతారు… కానీ, ఆ జిల్లాలో పార్టీలో లుకలుకలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. శనివారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాజా పరిణామాల నేపథ్యంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎంపీలు వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాలని కోరారు. తమ్ముడు పార్టీ వీడి వెళ్తానంటే.. స్టార్ క్యాంపెయినర్ వెంకటరెడ్డి మాట్లాడకపోతే ఎలా? అని సూటిగా ప్రశ్నించారు.

రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోతే కాంగ్రెస్ పార్టీకి ఇక నలుగురే ఎమ్మెల్యేలు ఉంటారని దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా స్పందించాలన్నారు. పార్టీలోకి చేరికల ద్వారా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లకు అన్యాయం చేయవద్దని, అధిష్టానం కూడా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.