Telugu Updates

సీఎంలు మారారు.. ట్రెండూ మారింది..!

ఒకేపార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఇదే తొలిసారి.

ఉత్తరాఖండ్: దే వ్ భూమిగా పిలిచే ఉత్తరాఖండ్ మళ్లీ భాజపా వశమైంది. యూపీ, మణిపూర్, గోవాతో పాటు ఇక్కడా కమలనాథులే సత్తా చాటారు. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓటమిపాలైనా రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజార్టీ సాధించి చరిత్రను తిరగరాశారు. రాష్ట్రం ఏర్పాటైనప్పట్నుంచి ఒకేపార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఎంతో రాజకీయానుభవం ఉన్న హరీశ్ రావత్ సారథ్యంలో బరిలోకి దిగిన కాంగ్రెస్ ను మట్టికరిపించిన కమలనాథులు.. దేవ్ భూమిలో కాషాయ జెండాను రెపరెపలాడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను (36) దాటేసి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో 57 స్థానాలు గెలుచుకున్న భాజపాకు ఈసారి కాస్త సీట్లు తగ్గే అవకాశమైతే కనబడుతోంది..