Telugu Updates

కానిస్టేబుల్ గన్ ఫైర్ కలకలం.?

ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: కౌటాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న టీఎస్ఎస్ పీ కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ అయినట్టు సమాచారం. బెల్లంపల్లి బట్వాన్పల్లి గ్రామానికి చెందిన సూర రజనీ కుమార్(29) తండ్రి సూర కొమురయ్య, మంచిర్యాల్ గుడిపేట బెటాలియన్ 2020 బ్యాచ్ గా గుర్తించారు. మంగళవారం ఉదయం 4: 30 ప్రాంతంలో గన్ మిస్ ఫైర్ అవ్వడంతో మెడలోంచి బెల్లెట్ దూసుకెళ్లింది. గమనించిన పోలీసులు వెంటనే అతనిని హుటాహుటిన కాగజ్నగర్ విజయ్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రథమ చికిత్స అందించిన అనంతరం అతని పరిస్థితి విషమిస్తుండటంతో హైదరాబాద్ కు తరలించడం జరిగింది. జిల్లా ఎస్పి కే సురేష్ కుమార్, కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, కౌటాల సీఐ బుద్దే స్వామి, ఆసుపత్రికి చేరుకుని డాక్టర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిస్ ఫైర్ లేక ఆత్మహత్య నా అనే కోణంలో విచారణ చేపట్టిన పోలీస్ అధికారులు.