Telugu Updates

బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు పొడిగింపు

సీపీ ఎస్ చంద్రశేఖరరెడ్డి..

రామగుండం పోలీస్ కమిషనరేట్: ప్రజల భద్రత, రక్షణ కోసం బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు, ఎప్రిల్ 1 నుండి 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలం పరిమితి పొడిగించబడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే అనుమతి లేని డ్రోన్, డిజె సౌండ్స్ పై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు..