మంచిర్యాల జిల్లా: జూలై 23, 24 తేదీల్లో మంచిర్యాల పట్టణంలో సిపిఐ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ తెలిపారు. బుధవారం జరిగిన పార్టీ జిల్లా, మండల, పట్టణ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సభలలో గత మహాసభల నుండి ఈ మహాసభల వరకు జిల్లా ఉద్యమాన్ని సమీక్షించుకుని భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకుంటామని పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మామిడాల రాజేశం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు రామడుగు లక్ష్మణ్, ఖలిందర్ అలీఖాన్, మేకల దాసు, చిప్ప నర్సయ్య, మామిడాల రాజేశం, బీమనాధుని సుదర్శన్, జోగుల మల్లయ్య, రేగుంట చంద్రశేఖర్, దేవి పోచన్న, గుండా మాణిక్యం, లక్ష్మినారాయణ, సన్నీ, బానేష్ పాల్గొన్నారు.