Telugu Updates

దిల్లీ లిక్కర్ స్కామ్. తాజాగా ఒకరి అరెస్ట్.?

దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వేగవంతం చేసింది. గతకొన్ని రోజులుగా పలువురిని విచారించిన సీబీఐ.. తాజాగా ఒకరిని అరెస్ట్ చేసింది. ఈ మేరకు సీబీఐ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

ఆంజనేయులు న్యూస్, దిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వేగవంతం చేసింది. గతకొన్ని రోజులుగా పలువురిని విచారించిన సీబీఐ.. తాజాగా ఒకరిని అరెస్ట్ చేసింది. ఈ మేరకు సీబీఐ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ కేసులో హైదరాబాద్ కు చెందిన అభిషేక్ బోయినపల్లి అరెస్ట్ చేశామని. ఆయన్ను కోర్టులో  హాజరుపరుస్తామని తెలిపింది. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు సీబీఐ అరెస్ట్ చేసిన వారి సంఖ్య 2కి చేరింది. అభిషేక్ కు ముందు విజయ్ నాయర్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. మరోవైపు ఇదే కేసులో విచారణ చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా సమీర్ మహేంద్ర అనే వ్యక్తిని అరస్ట్ చేసిన విషయం తెలిసిందే.