ఎమ్మెల్యే సోదరుడికి దళిత బంధు..?
వరంగల్: దళితబంధు పథకం అమలులో కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు తమ అనుచరులు, కార్యకర్తలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జనగామ జిల్లాలో ఎంపిక చేసిన 185 మంది లబ్ధిదారుల జాబితాలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సోదరుడు, ఘన్పూర్ సర్పంచి సురేశ్ కుమార్ పేరు ఉండడం గమనార్హం. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా.. దళితబంధు పథకంలో ఎస్సీల్లో పేదలకే ఇవ్వాలనే నిబంధన లేదని, ప్రభుత్వ ఉద్యోగులు కాని 60 ఏళ్ల లోపు వారు అంతా అర్హులేనని వివరించారు..