Telugu Updates

డ్రగ్స్ కు అడ్డాగా హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

హైదరాబాద్: హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. తెలంగాణ తెచ్చుకున్నది మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మడానికి కాదని అగ్రహం వ్యక్తం చేశారు. మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తుందని విమర్శించారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన భట్టి.. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై స్పందించారు. అత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకని పోలీసులు దర్యాప్తును ఆలస్యం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవన్నారు. హోం శాఖ మంత్రి మహమూద్ అలీని కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ మహిళా నాయకులను ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. క్రైమ్ హైదరాబాద్ కు ‘ మాత్రమే పరిమితం కాలదేని.. రాష్ట్రమంతా పాకిపోయిందని ఆరోపించారు. అధికారులపై ఒత్తిడి పెరగడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

న్యాయవాది వామన్ రావు హత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరామని.. ఆ విషయంలో ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆక్షేపించారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే నడుపుతుందని.. ఆ కుటుంబం చెప్తే తప్ప రాష్ట్ర మంత్రులు స్పందించడం లేదని భట్టి విమర్శించారు.