తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా వికాస్ రాజ్..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్ నియమితులయ్యారు. ప్రస్తుతం సాధారణ పరిపాలనాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న వికాస్ ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసిన శశాంక్ గోయల్ బదిలీ అయిన విషయం తెలిసిందే. వికాస్ రాజ్ తెలంగాణ కేడర్ కు చెందిన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి..