ఆంజనేయులు న్యూస్: ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్లాట్ఫామ్ లోని ‘నియర్ బై ఫ్రెండ్స్’, ‘వెథర్ అలర్ట్’ అనే రెండు ఫీచర్లను తీసేస్తున్నట్లు వెల్లడించింది. మే 31 వరకే ఈ ఫీచర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఆ తర్వాత ఇవి అందుబాటులో ఉండవు. దీంతో లోకేషన్ హిస్టరీ, బ్యాక్ గ్రౌండ్ లోకేషన్ వంటి సేవలు కూడా వీటితో పాటు నిలిచిపోతాయి. ఈ నెలాఖరుకు ఇప్పటివరకు ఇందులో సేవ్ అయిన డేటా డిలీట్ అవుతుంది. ఫేస్బుక్ ‘నియర్ బై ఫ్రెండ్స్’ ఫీచర్ ను 2014లో ప్రారంభించింది.