Telugu Updates

ట్విటర్ లో బోగస్ సమాచారం..?

దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి ప్రకటన

హైదరాబాద్: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ 15 నెలలుగా కరెంటు బిల్లులు చెల్లించని కారణంగా హైదరాబాద్ లోని ఆయన నివాసానికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) ట్విటర్లో పేర్కొన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ట్వీట్ బోగస్ అని డిస్కం సీఎండీ రఘుమారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని విద్యుత్  పంపిణీ సంస్థ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. సంస్థ పేరు మీద ఇలాంటి అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు..