Telugu Updates

నకిలీ విత్తనాల సరఫరాకు సహకరిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు

మంచిర్యాల డిసిపి అఖిల్ మహాజన్

మంచిర్యాల జిల్లా: నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే పిడి యాక్ట్ తప్పదని మంచిర్యాల ఇంచార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ హెచ్చరించారు. శనివారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఫెర్టిలైజర్ దుకాణాల డీలర్లతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించదని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, నిషేధిత గడ్డి మందుల అక్రమ రవాణాకు సహకరిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎసిపి తిరుపతి రెడ్డి, సిఐ నారాయణ, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.