మంచిర్యాల జిల్లా: వరంగల్ లో శుక్రవారం జరగనున్న రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ గోడ పోస్టర్లను జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ సభకు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డిసిసి అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో జిల్లా నుంచి 10 వేల మంది కార్యకర్తలు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మున్సిపల్ ప్లోర్ లీడర్ ఉప్పలయ్య, డిప్యూటీ ప్లోర్ లీడర్ సంజీవ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేశ్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వడ్డే రాజమౌళి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సల్ల మహేష్, తదితరులు పాల్గొన్నారు..