వన్డేల్లో 250 వికెట్లు సాధించిన తొలి మహిళా క్రికెటర్.!
ఆంజనేయులు న్యూస్: టీమిండియా మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి వరల్డ్ క్రికెట్ లో అరుదైన రికార్డును కైవసం చేసుకుంది. మహిళా క్రికెట్ ను సంబంధించి వన్డేల్లో 250 వికెట్లు సాధించిన తొలి క్రికెటర్ గా ఆమె నిలిచింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఉమెన్ క్రికెట్ కప్లో భాగంగా బుధవారం ఇంగ్లండ్ తొ జరిగిన మ్యాచ్ లో ఓ వికెట్ పడగొట్టిన జులన్.. ఈ ఘనతను సాధించింది. ఇప్పటిదాకా 199 వన్డే మ్యాచ్ లు ఆడిన జులన్ 250 వికెట్లు పడగొట్టి ఎక్కువ వికెట్లు తీసుకున్న మహిళా క్రికెటర్ గా అగ్రస్థానంలో కొనసాగుతోంది. జులన్ తర్వాత స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్ ఫిట్జ్ ప్యాట్రిక్ (180 వికెట్లు), వెస్టిండిస్ బౌలర్ అనిసా మహమ్మద్ (180 వికెట్లు) ఉన్నారు. జులన్ సాధించిన ఘనతను కీర్తిస్తూ ఐసీసీ ఓ ట్వీట్ చేసింది…