హైదరాబాద్: గోదావరి వరద ముంపునకు గురైన భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ కు భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఆ గ్రామాలకు చెందిన ప్రతినిధులతో కలిసి రాజభవన్ లో గవర్నర్ ను.. ఎమ్మెల్యే వీరయ్య కలిశారు. ఈమేరకు గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు.
ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలను ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగి భద్రాచలం రెవెన్యూ డివిజన్ లో కలపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం సహకరించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు.