మంచిర్యాల జిల్లా: అప్పు సప్పు చేసి స్వoతింటి కలను సాకారం చేసుకున్న 14 రోజులకే వరద నీటితో ఆ ఇల్లు వల్లకాడుగా మారడం తట్టుకోలేక ఒకరు ఆత్మహత్య కు పాల్పడగా మరొకరు ఆస్పత్రి పాలైన సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రం లో చోటు చేసుకుంది..
మంచిర్యాల జిల్లా లోనీ బాలాజీ నగర్ కు చెందిన సిద్ది జమున కుటుంబం బ్యాంక్ లోన్ తీసుకొని తమ స్వంత ఇల్లు కోరిక నెరవేర్చుకున్నారు, కానీ గత 12 రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తెయ్యడం కాళేశ్వరం గోదావరి బ్యాక్ వరద నీరు ఇంట్లోకి వచ్చి ఇల్లు పూర్తిగా మునిగి పోయింది, కొత్త ఇల్లు మురిపెంలో సకల సౌకర్యాలతో ఫర్నిచర్, ఇంటి సామాగ్రి, అన్నీ వస్తువులతో గృహ ప్రవేశo చేసుకుని 14 రోజులు గడవక ముందే వరద వచ్చీ ఇంట్లోని వస్తువులను ఊడ్చూకు వెళ్ళింది, వరద నీటిలో సర్వస్వం కోల్పోవడం తో భర్త ఆసుపత్రి పాలైతే బార్య ఆత్మహత్యకు పాల్పడడం తో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగి పోయింది, స్వంతింటి కలలు ఆవిరై పోయాయనీ తమను ఆదుకోవాలని కోరుతున్నారు..