Telugu Updates

వరద బాధితులకు రూ. లక్ష నష్టపరిహారం ఇవ్వాలి

మంచిర్యాల జిల్లా: రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ. లక్ష నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి. ఆశన్న డిమాండ్ చేశారు. ఆదివారం మంచిర్యాలలో జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు సర్వం కోల్పోయారని ఆరోపించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. జిల్లాలో ఆదివాసీ గిరిజనులపై అటవీ శాఖ అధికారులు దాడులు ఆపాలని, పోడు భూముల సమస్యలు పరిష్కరించి పట్టాలివ్వాలని, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోమాస ప్రకాష్, అశోక్, దాసరి రాజేశ్వరి, ఎర్మ పున్నం, జిల్లా కమిటీ సభ్యులు దాగం రాజారాం, దుంపల రంజిత్ కుమార్, దూలం శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.