Telugu Updates

ఫుడ్ పాయిజన్ తో విద్యార్థుల అస్వస్థత..

ఆదిలాబాద్ జిల్లా: లోని కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల కేజీబీవీ బాలికల పాఠశాలలో బుధవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఫుడ్ పాయిజన్ జరగడంతో పాఠశాలలోని 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పలువురు విద్యార్థులు వాంతులు విరేచనాలు చేసుకోవడంతో హుటాహుటిన పాఠశాల సిబ్బంది ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి వారిని ప్రణీత స్పందించారు. విషయం తెలిసిన వెంటనే రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు..