మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని రాంనగర్ లో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సిద్ది జమున కుటుంబాన్ని గురువారం సాయంత్రం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అనంతరం మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాలతో వరదల కారణంగా ఇంట్లోకి నీరు చేరి ఆస్తి నష్టం జరగడంతో మనస్తాపం చెంది జమున ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అన్నారు.
అనంతరం పట్టణంలోని వివిధ కాలనీల్లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.. షర్మిల వెంట పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.