Telugu Updates

ట్రాఫిక్ పరిష్కారానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి

మంచిర్యాల  డిసీపీ అఖిల్ మహాజన్

మంచిర్యాల జిల్లా: కేంద్రంలో ట్రాఫిక్ పరిష్కారానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. బుధవారం మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో పట్టణ సీఐ నారాయణ నాయక్ ఆధ్వర్యంలో మంచిర్యాల చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకు, వీధి వ్యాపారులకు ట్రాఫిక్ సమస్య నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. షాపింగ్ కాంప్లెక్స్ యజమానులు పార్కింగ్ కు వినియోగించాల్సిన సెల్లార్లను గోదాములకు, ఇతరాత్ర అవసరాలకు వినియోగించడం, షాపుల ముందు చిరు వ్యాపారాలతో ట్రాఫిక్ కు ఇబ్బందిగా మారిందని తెలిపారు.

ఈ సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్తో పాటు మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి, ట్రాఫిక్ సీఐ నరేశ్ కుమార్, మున్సిపల్ టీపీవో రాధాకృష్ణ, ఎస్ఐలు తైహిసొద్దీన్, అంజయ్య, హరిశేఖర్, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వీధి వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు..