న్యూడిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పండిట్ సుఖ్ రామ్ (94) కన్నుమూశారు. ఈ నెల 4న ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆయనను న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన మనవడు ఆశ్రయ్ శర్మ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..
హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్సభ స్థానం నుంచి సుఖ్ రామ్ 3 సార్లు ఎంపీగా. ఎన్నికయ్యారు. . 1993-1996 మధ్య కాలంలో కేంద్ర ప్రసారాల వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1963 నుంచి 1984 వరకు మండి ఎమ్మెల్యేగా 5 సార్లు గెలుపొందారు. రాష్ట్ర పశుసంవర్ధక మంత్రిగా పని చేశారు. 1984లో మొదటిసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా పని చేశారు.