Telugu Updates

వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణం..?

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: తిర్యాని మండలంలో కొనసాగుతున్న 10వ తరగతి పరీక్షలలో విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. మండలం లో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉన్న చేసేదేమి లేక విద్యార్థులు పాఠశాలల ఉపాధ్యాయులు సమకూర్చిన ప్రైవేటు వాహనంలో ఇరుకున కూర్చొని ప్రయాణం కొనసాగిస్తున్నారు. సుమారు 25 కిలోమీటర్ల వరకు ప్రయాణం కొనసాగించి తీరా పరీక్ష సమయంలో విద్యార్థులు అలసటకు గురవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరీక్ష సమయంలో ఆర్టీసీ బస్సులు మండలంలో అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనంలో విద్యార్థులను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సిబ్బంది పరిమితికి మించి కూర్చోబెట్టి ఇటు పరీక్ష కేంద్రాన్ని తో పాటు అటు పాఠశాలలకు తరలిస్తున్నారు. అసలే రోడ్లు బాగా లేకపోవడం ప్రైవేటు వాహనాలలో పరిమితికి మించి ప్రయాణం కొనసాగించడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందనో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు..

అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మారుమూల గ్రామాల నుండిపరీక్ష రాసే విద్యార్థిని విద్యార్థులకు తగు రవాణా సౌకర్యాలు కల్పించాలని ప్రజలు, పిల్లల తలిదండ్రులు కోరుతున్నారు..