హైదరాబాద్: రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఎలుకలు, పిల్లులు, పాములు సంచరిస్తుండటంతో రోగులు, వారి బంధువులు బెంబేలెత్తిపోతున్నారు. అయినా.. అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం లేదు. దీనికి నిదర్శనమే ఈ చిత్రం. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి వంటశాలలో ప్రతి రోజూ వందల మంది రోగులకు సరిపడా ఆహార పదార్థాలు వండుతారు. ఇక్కడి వంట గదిలో బండలు ఎక్కడికక్కడ పగిలిపోయాయి. అపరిశుభ్ర వాతావరణం రాజ్యమేలుతోంది. దీంతో ఎలుకలు, పందికొక్కులు వచ్చే అవకాశముందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..