Telugu Updates

గంజాయి అమ్ముతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అరెస్ట్.?

హైదరాబాద్: లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడింది. కొండపనేని మాన్సీ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తన భర్త మదన్ మనేకర్ తో కలిసి గంజాయి దందా నడిపిస్తున్నట్టు బోయిన్ పల్లి పోలీసులు గుర్తించారు. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున గంజాయికి డిమాండ్ ఉందని గుర్తించిన ఆమె అరకు నుంచి గంజాయి తీసుకువచ్చి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో విక్రయాలు సాగిస్తోంది. గత నెలలో పక్కా సమాచారం దాడి చేసిన పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మాన్సీ, మనేకర్ పారిపోయారు. తాజాగా మాన్సీని మేడ్చల్ జిల్లా కొంపల్లిలో అరెస్ట్ చేశారు. మాన్సీ పూర్వీకులు తెలుగువారే. వారు చాలాకాలం కిందట మహారాష్ట్రలోని నాగపూర్ లో స్థిరపడ్డారు.