కష్టపడి చదివితే ఉద్యోగాలు సాధించ వచ్చు: జిల్లా ఎస్పి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అందిస్తున్న పోలీసు కానిస్టేబుల్ శిక్షణ శిభిరాన్ని జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్, ఐపీఎస్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పేదరికం ఉద్యోగాలకు ఆటంకం కాకుండా కష్టపడి చదివితే ఉద్యోగాలు సాధిస్తారని అన్నారు. అనంతరం కాసేపు అభ్యర్థులకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. కాగజ్నర్ డీఎస్పీ కరుణాకర్, జెడ్పీ వైస్ చైర్మెన్ కోనేరు కృష్ణ, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.