మంచిర్యాల జిల్లా: హాజీపూర్ మండలం గుడిపేటలో 13వ ప్రత్యేక పోలీస్ బెటలియాన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ పవార్ రాజ్ కుమార్ (45) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్ఐ ఉదయ్ కిరణ్ వివరాల ప్రకారం.. 2నెలలుగా విధులకు సక్రమంగా హాజరు కాని రాజుకుమార్ గురువారం బాత్రూంలో ఉరివేసుకొని మరణించాడు. సోదరుడి మృతిపై రాజు కుమార్ భార్య విజయలక్ష్మి, కుమారునిపై అనుమానం ఉందని తమ్ముడు వసంతరావు ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.