Telugu Updates

సమంత మొదటిసారి తీసుకున్న జీతం ఎంతో తెలుసా?

హైదరాబాద్: ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది అగ్ర కథానాయిక సమంత ఇటు తెలుగుతో పాటు హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోంది. నయనతార, విజయ్ సేతుపతిలతో కలిసి విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో సమంత నటించిన చిత్రం ‘కాతువాక్కుల రెండు కాదల్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సమంత ఇన్ వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

‘మీరు థియేటర్లో చూసిన మొదటి సినిమా ఏది’ అని అడగ్గా ‘జురాసిక్ పార్క్’ అని సామ్ సమాధానం ఇచ్చింది. అలాగే తనకు రొమాంటిక్ కామెడీ చిత్రాలంటే ఇష్టమని ‘కాతవాక్కుల రెండు కాదల్అదే జోనర్లో తెరకెక్కిన చిత్రమని వివరించింది. తన ఇన్స్టాన్ ను 23మిలియన్ల మంది ఫాలో అవడం అదృష్టమని చెప్పుకొచ్చింది. ఇక తన మొదటి సంపాదన రూ.500 అని సమంత తెలిపింది. 10 లేదా 11వ తరగతిలో ఉండగా, ఒక కాన్ఫరెన్స్ కు 8గంటలు హోస్ట్ చేస్తే, రూ. 500 ఇచ్చారని చెప్పుకొచ్చింది. ప్రతి రోజూ సంతోషంగా ఉండాలని, ఉన్నంత కాలం ఉన్నతంగా బతకడమే తన కలని తెలిపింది. టాటూస్ గురించి అడగ్గా, తాను యువతిగా ఉన్న సమయ ఎప్పటికీ టాటూలు వేసుకోకూడదని అనుకున్నాననని, వాటి జోలిక అస్సలు పోవద్దని సూచించింది. (సామ్ తన శరీరంపై మూడు టాటూలు వేసుకున్న సంగతి తెలిసిందే.)