మంచిర్యాల జిల్లా: జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మరో మూడు ప్రైవేట్ డెంటల్ ఆసుపత్రులను శుక్రవారం సీజ్ చేశారు. కలెక్టర్ భారతీ హోలికెరీ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో వైద్యారోగ్య శాఖ, రెవెన్యూ, పోలీస్ ఐఎంఎ అధికారులు పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వికాన్ డెంటల్, నరేష్ డెంటల్, స్మైల్ డెంటల్ ఆసుపత్రులను సీజ్ చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించాలన్నారు. సరైన ధృవపత్రాలు, అనుమతులు కలిగి ఉండటంతో పాటు వైద్య సేవలు, సదుపాయాలు కల్పించడంలో నియమావళి తప్పనిసరిగా పాటించాలని, వీటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు..