Telugu Updates

ప్రసుతికి వచ్చిన గర్భిణీ పుట్టిన పాప మృతి…ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.?

ఆదిలాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ప్రసూతి కోసం వచ్చిన గర్భిణీ తో పాటు అప్పుడే పుట్టిన బాబు మృతి చెందిన ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. జిల్లా కేంద్రంలోని శారదా నర్సింగ్ హోమ్ లోకి మంగళవారం మద్యాహ్నం శాంతినగర్ కు చెందిన షాకేర సుల్తాన్ (30) అనే గర్భిణీ ప్రసూతి వైద్యానికి వచ్చారు. ఐతే డెలివరీ అయిన తర్వాత పుట్టిన బాబు చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఐతే బాలింత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కాసేపటి తర్వాత బాలింత షాకేర సుల్తాన్ సైతం చనిపోయిందని వైద్యులు తెలియచేయడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. బంధువులు మిత్రులు భారీగా హాస్పిటల్ కు తరలి వచ్చి ఆందోళన చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను సముదాయించేందుకు యత్నించినా ఫలితం లేకపోవడంతో సుమారు గంటకుపైగా ఆసుపత్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది..