ఇడ్లీ తింటుండగా జెర్రి ప్రత్యక్షం..?
పెద్దపల్లి జిల్లా: పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఓ మహిళకు వింత పరిస్థితి ఎదురైంది. వారపు సంతలో కూరగాయలు అమ్మే మహిళ రమ కు సోమవారం స్థానిక హోటల్ నుంచి ఇడ్లీ తేప్పించుకుంది. అందులో రెండు ఇడ్లీలు తినేసింది. మూడో ఇడ్లీ తింటుండగా అందులో జెర్రి ఉండడం గమనించింది..
వెంటనె విషయాన్ని చుట్టుపక్కల వాళ్లకు తెలిపింది. విషయం తెలియడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లలో తనిఖీలు చేసి, జరిమానాలు విధించారు.