వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళసై పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిపై పర్యటించారు. అశ్వాపురం మండలం బట్టీల గుంపు వద్ద బాధితులతో ఆమె మాట్లాడారు. ఆ ప్రాంతానికి చెందిన సర్పంచ్ లు తమ సమస్యలపై గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం అశ్వాపురంలోని వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని తమిళిపై సందర్శించారు. ముంపు బాధితుల సమస్యలు విన్నానని..
వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సాయంత్రం చింతిర్యాల, గౌతమినగర్ ప్రాంతాల్లో ఆమె పర్యటించి వరద సహాయక సామగ్రిని అందజేయనున్నారు..