Telugu Updates

అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన అప్రజాస్వామిక

మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో టిఆర్ఎస్ నేతలు పాల్గొని ఉపన్యాసాలు ఇవ్వడం ప్రోటోకాల్ కు విరుద్ధమని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శనివారం మంచిర్యాలలోని. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే తనయుడు విజిత్ రావు ప్రతి అధికారిక సమావేశంలో వేదికపై ప్రసంగాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించడమే అవుతుందని తెలిపారు. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాల్లో టిఆర్ఎస్ నేతలకు వేదికలపై ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రోటోకాల్ వివాదంపై జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అవసరమైతే న్యాయస్థానానికి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తామని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో ఎన్నికల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కొరతామని ఆయన ప్రకటించారు.

ఆసరా పింఛన్లు అర్హులైన అందరికీ ఇవ్వకుండా కొంతమందికి మాత్రమే ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. టిఆర్ఎస్ కు ఓట్లు వేస్తేనే పింఛన్లు వస్తాయని, లేకపోతే తొలగిస్తామన్న బెదిరింపులకు ప్రజలు భయపడరని అవసరమైతే తిరుగుబాటు చేసి తరిమికొట్టే రోజు వస్తుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.