Telugu Updates

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆశ వర్కర్ల ధర్నా.!

మంచిర్యాల జిల్లా: ఆశ వర్కర్లపై పని భారాన్ని తగ్గించి, అధికారుల వేధింపులు. ఆపాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిఐటియు అనుబంధ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ లో అధికారుల వేధింపుల వల్ల చనిపోయిన ఆశ వర్కర్ కుటుంబానికి రూ. 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సమ్మక్క మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆశ వర్కర్లపై అధికారుల వేధింపులు ఆపాలని, పని భారం తగ్గించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఏరియర్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాళ్లు నీరజ, శోభ, సరోజ, సునీత, పద్మ, రాజేశ్వరి, వసంత, లలిత, స్వప్న, తదితరులు పాల్గొన్నారు..