ఆదిలాబాద్ జిల్లా: అత్యవసర సమయాల్లో రక్తం ఆవశ్యకత ఎంతో అందరికీ తెలిసిందే. అలాంటి రక్తాన్ని సేకరించడంలో ఆదిలాబాద్ రిమ్స్ రక్తనిధి కేంద్రం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలలో ఆదిలాబాద్ రిమ్స్ రక్తనిధి కేంద్రం అత్యధికంగా రక్తాన్ని సేకరించి ప్రథమ స్థానంలో నిలిచి అందరికి గర్వకారణమైనది. జిల్లాలోని రక్త దాతల సహకారం, స్వచ్ఛంద రక్తదాన శిబిరాలతో అత్యధికంగా రక్తం ను సేకరించి రాష్ట్రంలోని ప్రథమంగా నిలవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది..
ఈ ఘనత సాధించినందుకు గాను రిమ్స్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ రాజ్య లక్ష్మి ని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, డాక్టర్ శ్రీకాంత్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది అభినందించారు..