Telugu Updates

రాజ్యసభలో కొనసాగుతున్న సస్పెన్షన్లు.. ఆప్ ఎంపీపై వేటు

దిల్లీ: పార్లమెంట్ లో విపక్ష ఎంపీలపై క్రమశిక్షణా చర్యలు కొనసాగుతున్నాయి. సభా మర్యాదలను ఉల్లంఘించినందుకు గానూ నిన్న రాజ్యసభలో 19 మంది ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఎంపీని సస్పెండ్ చేశారు. సభలో నినాదాలు చేయడంతో పాటు కాగితాలు చించి ఛైర్మన్ కుర్చీ పైకి విసిరినందుకు గానూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈ వారమంతా సస్పెండ్ చేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ తెలిపారు. అంతకుముందు లోక్సభలోనూ నలుగురు కాంగ్రెస్ ఎంపీలను ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా ఇప్పటివరకు 24 మంది విపక్ష ఎంపీలపై వేటు పడింది. అయితే ఈ పరిణామాలపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలను లేవనెత్తేందుకు ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం తమను సస్పెండ్ చేస్తూ ఆందోళనలను అణచివేసే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ కుడా ధయ్యబాట్టారు..

రాజ్యసభ మూడు సార్లు వాయిదా..?
వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఉభయ సభలు విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లుతున్నాయి. జీఎస్టీ, నిత్యావసరాలు, గ్యాస్, ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు నిరసనలకు దిగుతుండటంతో సభల్లో వాయిదాల పర్వం నెలకొంది. బుధవారం రాజ్యసభ భోజన విరామానికి ముందే మూడుసార్లు వాయిదా పడటం గమనార్హం. ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్ష పర్వం నెలకొంది. బుధవారం రాజ్యసభ భోజన విరామానికి ముందే మూడుసార్లు వాయిదా పడటం గమనార్హం. ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. అనంతరం తిరిగి ప్రారంభమైనా పరిస్థితులు కుదటపడలేదు. దీంతో సభను 12.18 గంటల వరకు వాయిదా వేశారు. కాసేపటికి సభ మొదలవ్వగానే విపక్ష ఎంపీలు హాల్లోకి దూసుకొచ్చారు. దీంతో మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. అటు లోక్సభలోనూ ఇలాంటి గందరగోళమే నెలకొనడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.