చండీగఢ్: పంజాబ్‌లో కబడ్డీ ప్లేయర్ల హత్యల పరంపర కొనసాగుతున్నది. గత నెల అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు సందీప్‌సింగ్ హత్య ఉదంతం మరిచిపోకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. పటియాలలోని పంజాబీ యూనివర్సిటీ ప్రాంతంలో కబడ్డీ ప్లేయర్ ధర్మిందర్‌సింగ్ దారుణ హత్యకు గురయ్యాడు.
రెండు వర్గాల మధ్య సయోధ్యను కుదుర్చే క్రమంలో ధర్మిందర్‌ను తుపాకీతో కాల్చి చంపారు. ఈ హత్య ఘటనలో పోలీసులు ఇప్పటికే నలుగురు వ్యక్తులను తమ అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు శిరోమణి అకాలీదళ్ పార్టీలో ఉన్న ధర్మిందర్‌సింగ్ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ కోసం పనిచేశాడు. ఒక కబడ్డీ ప్లేయర్ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేయడం హత్యకు దారి తీసిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.