తమిళనాడులో విజయ్ గెలుపుపై స్పందించిన కవిత
రాజకీయ చరిత్రను తిరగరాసేందుకు కొత్త శక్తులు అవసరమన్న కవిత ఈ విషయాన్ని తమిళ ప్రజలు నిరూపించారన్న కవిత ఈ దేశానికి తమిళ ప్రజలు ఒక సంకేతం పంపించారని వ్యాఖ్య తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ అధినేత్రి కవిత స్పందించారు. భ్రష్టుపట్టిపోయిన ఈ రాజకీయ చరిత్రను తిరగ రాయడానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమని తమిళ ప్రజలు నిరూపించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె 'ఎక్స్' వేదికగా స్పందించారు. "ఉన్న వాళ్లతో విసిగిపోయాం. అధికార దాహార్తులతో వేసారిపోయాం. భ్రష్టుపట్టిపోయిన...