మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి హైదరాబాద్‌కు చెందిన స్వరూప, అలియాస్ రూప, సిసిసి, మంచిర్యాల పట్టణాలకు చెందిన రజిత, సుశీల అనే ముగ్గురు కిలాడి లేడీస్ రాష్ట్ర రాజకీయ నాయకుల వద్ద పిఏ లమంటు వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 16 మంది నుంచి రూ.సుమారు 66 లక్షల రూపాయలు వసూలు చేసి మోసగించిన సంఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పై మంచిర్యాల డిసిపి అఖిల్ మహాజన్ కేసు నమోదు దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల, మందమర్రి, భూపాలపల్లి, ఎటునాగరం ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ, యువతి యువకులకు మాయ మాటలు చెప్పి జిల్లా కలెక్టరేట్, సింగరేణి, ఎన్టిపిసి సంస్థలలో అకౌంటెంట్, క్లర్క్, అటెండర్ ఉద్యోగల నియామకం కోసమని నమ్మబలికి 66 లక్షల రూపాయలు వసూలు చేశారని పిర్యాదు రావడంతో విచారణ చేపట్టామనీ తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని అన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు ఇస్తామని చెబితే నమ్మొద్దని, ప్రభుత్వ నిబంధనల మేరకే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్ ద్వారానే నియామకాలు జరుగుతాయని అన్నారు. చట్ట వ్యతిరేకమైన పనులు ఎవరైనా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.