Telugu Updates

మహాత్మా బసవేశ్వర జయంతి నిర్వహించిన: జిల్లా ఎస్పీ

రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా పోలీసు కార్యాలయంలో మహాత్మా బసవేశ్వర జయంతి సందర్భంగా బసవేశ్వర స్వామి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే ఐపీఎస్.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బసవేశ్వర స్వామి సమాజంలో కుల వ్యవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. లింగాయత ధర్మం స్థాపించారు. చిన్న వయసులోనే శైవ పురాణ గాథలను అవగతం చేసుకొని, రాజ్యపాలనలో ప్రధాన భూమిక నిర్వహిస్తూ. వచన సాహిత్యంతో ప్రజలందరినీ కులమతాలకతీతంగా ఏకం చేసారు. బోధనలలోని సమదృష్టి ఎందరినో ఆకర్షించి, వీరశైవ మతానికి పట్టం కట్టిన బసవేశ్వర స్వామి ఖ్యాతి కర్ణాటక ఎల్లలు దాటి తెలుగు రాష్ట్రాలలో వ్యాప్తి రా చెందడం జరిగిందన్నారు.