Telugu Updates

మన ఊరు మన బడితో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం

మంచిర్యాల జిల్లా: మన ఊరు మన బడి పథకంలో భాగంగా సోమవారం దండేపల్లి మండలం పాత మామిడిపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మౌళిక వసతుల కల్పనకు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు మన బడి ద్వారా ప్రభుత్వ బడులను బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. నాణ్య మైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్య క్రమంలో టిఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు..